కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- November 05, 2025
కువైట్: కువైట్ లో అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాల్లో ఒకటైన జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని 67 భవనాల కూల్చివేతకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. భవనాలు సురక్షితంగా లేవని మరియు ప్రజా భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని టెక్నికల్ కమిటీ తనిఖీలు నిర్ధారించాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ప్రభావిత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టడాలు అందులో ఉంటున్న వారి ప్రాణాలతోపాటు చుట్టుపక్కల ఉంటున్న వారికి ముప్పు కలిగిస్తాయని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్ వెల్లడించారు. ఇక నోటీసులను పట్టించుకోని సందర్భంలో, భవనాలను పూర్తిగా ఖాళీ యజమాని ఖర్చుతో మునిసిపాలిటీ కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!







