ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- November 05, 2025
అమెరికా: పిట్స్‌బర్గ్‌లో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పిట్స్‌బర్గ్ విభాగం తాజాగా తన తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపింది. తెలుగు సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతిభా పురస్కారాలతో ఈ వేడుకలు పిట్స్‌బర్గ్ తెలుగువారికి తియ్యటి అనుభూతులను పంచాయి. గణేశ్ ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు విద్యార్దుల పాడిన భక్తి గీతాలు ఆధ్యాత్మిక పరిమళాన్ని పంచాయి. పియానో, వయోలిన్ వంటి వాయిద్యాలతో తమ సంగీత ప్రతిభను కూడా తెలుగు చిన్నారుల ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు.
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ హరి గుంట, శ్రావ్యా నిర్వహించిన సంగీత కచేరీ తెలుగు వారికి తియ్యటి మాధుర్యాన్ని, చిందులేసే ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తర్వాత చిన్నారుల నుండి పెద్ద నృత్యాలు, పాటలు, నాటికలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇదే వేడుకలో స్పెల్‌బీ , లీగో క్రియేషన్, చిత్ర లేఖనం, గణితపోటీలు, చదరంగం పోటీలు ఇలా రకరకాల విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
ఆటిజం పిల్లల కోసం “పీస్ బై పీస్” పజిల్ కార్యక్రమం...ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకంగా “పీస్ బై పీస్” పజిల్ కార్యక్రమం ఆటిజం పిల్లలు శాంతంగా, సృజనాత్మకంగా తమ ప్రతిభను వ్యక్తపరిచే వేదికగా మారింది. నాట్స్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ఈ పజిల్ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు, ప్రేక్షకులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ వార్షికోత్సవానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నేషనల్ కో-ఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, మిడ్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ దగ్గుపాటి మరియు శంకర్ జెర్రిపోతుల తదితరులు హాజరయ్యి పిట్స్‌బర్గ్ టీమ్ సభ్యులను అభినందించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







