దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- November 06, 2025
యూఏఈ: దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. ఇవి స్మార్ట్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న రైడ్‌లకు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు నేరుగా రోడ్డుపై టాక్సీలను ఉపయోగించే వినియోగదారులకు వర్తించవని RTA స్పష్టం చేసింది.
కొత్త ఛార్జీల నిర్మాణం ప్రకారం, కనీస టాక్సీ ఛార్జీని Dh12 నుండి Dh13కి పెంచారు. వారంలోని రోజును బట్టి మారుతూ ఉండే కొత్త పీక్-అవర్ రేట్లు మరియు బుకింగ్ ఫీజులను కూడా అథారిటీ సవరణలు చేసింది.
సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 గంటల నుండి 9.59 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 7.59 గంటల వరకు పీక్ అవర్స్ గా నిర్ణయించారు. ఈ సమయాల్లో Dh5 చెల్లించాలి. ప్రయాణించిన దూరంతో సంబంధం లేకుండా, Dh7.5 పీక్-అవర్ సర్‌ఛార్జ్ తో పాటు చెల్లించాలి. సోమవారం నుండి గురువారం వరకు, రాత్రి ప్రయాణీకులు Dh5.5 మినిమం ఛార్జీతో పాటు Dh4.5 సర్‌ఛార్జ్ కూడా చెల్లించాలి.
శుక్రవారం, పీక్ అవర్స్ ఉదయం 8 నుండి 9.59 వరకు మరియు సాయంత్రం 4 నుండి 9.59 వరకు ఉంటాయి. రాత్రి 10 నుండి 11.59 వరకు మినిమం ఛార్జీ Dh5.5గా ఉంటుంది. వారాంతాల్లో పీక్ మరియు నాన్-పీక్ అవర్స్ వేర్వేరు సమయాలు, ఛార్జీలు అమల్లో ఉంటాయి. శని మరియు ఆదివారాల్లో, పీక్ అవర్స్ సాయంత్రం 4 నుండి రాత్రి 9.59 వరకు మరియు రాత్రి 10 నుండి రాత్రి 11.59 వరకు ఉంటాయి. మొదటి స్లాట్ సమయంలో మినిమం ఛార్జీ Dh5 కాగా, రెండవ స్లాట్‌లో ప్రయాణికులు ప్రామాణిక Dh7.5 పీక్-అవర్ ఫీజుతో పాటు Dh5.5 చెల్లించాలి. వారాంతాల్లో, రద్దీ సమయాల్లో మినిమం ఛార్జీ Dh5గానే ఉంటుంది. Dh4 పీక్-అవర్ ఫీజు వర్తిస్తుంది. రాత్రిపూట అనగా అర్ధరాత్రి నుండి ఉదయం 5.59 వరకు ప్రయాణికులు Dh4.5 సర్‌ఛార్జ్‌తో పాటు Dh5.5 మినిమం ఛార్జీ చెల్లించాలి.
ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రామాణిక కనీస ఛార్జీ ఇప్పటివరకు Dh12గా ఉంది. దీనికి అదనంగా కి.మీ.కు Dh1.97గా ఉంది. దుబాయ్ విమానాశ్రయ టాక్సీలు Dh25 నుండి ప్రారంభమవుతాయి. అయితే రోడ్డుపై ఉన్న టాక్సీలు రద్దీ లేని సమయాల్లో Dh5 నుండి రద్దీ సమయాల్లో Dh9 వరకు వేరియబుల్ మినిమం రేట్లను వసూలు చేస్తారు.
అదేవిధంగా, కొన్ని దుబాయ్ ప్రాంతాలలో వేరియబుల్ పార్కింగ్ ఫీజులు ఎక్కువగా వర్తింపజేస్తారు. రద్దీ, సమయం మరియు డిమాండ్ ఆధారంగా ఛార్జీలు మారుతుంటాయి. RTA చివరిసారిగా ఫ్లాగ్-డౌన్ లేదా ఫ్లాగ్‌ఫాల్ రేట్లను జనవరి 2024లో సవరించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







