కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- November 06, 2025
కువైట్ : కువైట్ లోని 146 వాణిజ్య సంస్థలకు ఫైర్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన నేపత్యంలో జలీబ్ అల్-షుయ్యుఖ్లోని 146 వాణిజ్య సంస్థలను మూసివేస్తామని కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రకటించింది.
మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఫైర్ ఫోర్స్ యాక్టింగ్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-కహ్తానీ తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక మరియు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వాణిజ్య సంస్థలను గుర్తించి, హెచ్చరిస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు పాటించిన కొన్నింటిని వెంటనే మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు మరియు షట్డౌన్లను నివారించడానికి భద్రతా నిబంధనలను పాటించాలని వ్యాపార యజమానులకు ఆయన సూచించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







