మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- November 06, 2025
న్యూ ఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కూడా మోదీని కలిసిన వారిలో ఉన్నారు. జట్టును మోదీ అభినందించారు.
ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ అనంతరం టీమిండియా ధాటిగా ఆడిన తీరును గుర్తుచేసుకుని మరీ మోదీ ప్రశంసించారు. మహిళా ప్లేయర్లతో మోదీ మాట్లాడారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదని, అది ప్రజల జీవితంలో భాగమైందని చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇవాళ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 52 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది.
ప్రపంచకప్ గెలిచిన జట్లు
1973–ఇంగ్లాండ్
1977/78–ఆస్ట్రేలియా
1981/82–ఆస్ట్రేలియా
1988/89–ఆస్ట్రేలియా
1993–ఇంగ్లాండ్
1997/98–ఆస్ట్రేలియా
2000/01–న్యూజిలాండ్
2004/05–ఆస్ట్రేలియా
2008/09–ఇంగ్లాండ్
2012/13–ఆస్ట్రేలియా
2017–ఇంగ్లాండ్
2021/22–ఆస్ట్రేలియా
2025/26–భారత్
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







