కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- November 06, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రక్షాళన దిశగా నూతన పాలకమండలి కీలక అడుగులు వేస్తోంది.సంస్థలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో పాటు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. నిన్న విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.
గత అద్దె బస్సుల ఒప్పందాలపై దృష్టి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి అద్దె బస్సుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 200 అద్దె బస్సుల లీజు పరిమితిని పెంచి, యజమానులకు లబ్ధి చేకూర్చడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని ప్రస్తుత పాలక మండలి అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమీక్షించి, వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది.
ఉద్యోగుల సమస్యలు, విద్యుత్ బస్సులపై చర్చ
రాష్ట్రంలో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులను నడపాలని ప్రభుత్వం(Govt) భావిస్తున్న నేపథ్యంలో, వాటి అమలు సాధ్యాసాధ్యాలపై బోర్డు చర్చించింది. విద్యుత్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఉద్యోగ నియామకాలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఉద్యోగ భర్తీ: ఆర్టీసీలో నిలిచిపోయిన కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, 9 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని బోర్డు తీర్మానించింది.
వైద్య సదుపాయం: ఉద్యోగులకు విలీనానికి ముందున్న అపరిమిత వైద్య సదుపాయాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు చైర్మన్‌కు వినతిపత్రం అందజేశాయి.
కొత్త డిపో ప్రతిపాదన: ఏలూరు జిల్లా చింతలపూడిలో కొత్త బస్ డిపోను నిర్మించాలని విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!
- రైల్వే అనుసంధానం, లాజిస్టిక్స్‌పై కువైట్, సౌదీ చర్చలు..!!
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..







