'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ ప్రధాన పాత్రలో డా.శివ రాజ్ కుమార్....
- November 06, 2025
భారతీయ సినీ చరిత్రలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలంటే ఎంతో పరిశోధన, ధైర్యం అవసరం. మాజీ ఎమ్మెల్యే, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నర్సయ్య గారి లాంటి వ్యక్తి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం ఒక సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే భుజానికెత్తుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరుపున నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు.
గుమ్మడి నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజానాయకుడు, నిజాయితీకి మారుపేరైన నాయకుడు. ఆయన రాజకీయాలు చేయడానికి కారణం అధికారాన్ని పొందడం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించడం. 1940ల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిగా ఎదిగారు. రైతు కుటుంబంలో పుట్టి, భూమి పట్ల, పేదల జీవన విధానాల పట్ల ఉన్న అనుభవమే ఆయనను ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా మలిచింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







