భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

- November 06, 2025 , by Maagulf
భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది.అత్యాధునిక ఏఐ  సాంకేతికతను ఉపయోగించి భక్తులు కేవలం రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ(TTD) చైర్మన్ బీ.ఆర్ నాయుడు తెలిపారు. ఈ విధానం కోసం పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే అన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళిత వాడల్లో 5,000కు పైగా శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

ఇక తిరుపతిలోని ఫ్లైవోవర్‌కు మునుపటి “శ్రీనివాస సేతు” అనే పేరును మార్చి తిరిగి “గరుడ వారధి”గా నిర్ణయించినట్లు నాయుడు తెలిపారు. అదనంగా, తిరుపతి విమానాశ్రయానికి “శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టు”గా నామకరణం చేయడానికి ఫైలు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు చెప్పారు.విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూముల లీజులు రద్దు చేశామని, తిరుమల కింద 50 ఎకరాల్లో 25,000 మంది భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించే ప్రణాళిక ఉందని తెలిపారు.ఏడాది కాలంలో టీటీడీకి సుమారు రూ.1,000 కోట్ల విరాళాలు అందాయని, దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం కార్యక్రమం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com