ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు

- November 06, 2025 , by Maagulf
ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు

న్యూ ఢిల్లీ: మంచి నాణ్యత గల ఛార్జర్‌ ఉపయోగించడం మీ మొబైల్‌ ఫోన్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బ్యాటరీ మరియు పరికరానికి నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. అయితే, నకిలీ లేదా నాణ్యత లేని ఛార్జర్లు వాడటం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గడం, అతి వేడి పడి పరికరం దెబ్బతినడం, ఇంకా కొన్ని సందర్భాల్లో పేలుళ్లు సంభవించడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను జాగ్రత్తగా ఉండమని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ తమ అధికారిక ‘జాగో గ్రాహక్ జాగో’(Jago Grahak Jago) హ్యాండిల్‌ ద్వారా ఒక హెచ్చరిక పోస్టు విడుదల చేసింది. అందులో, “నాణ్యత లేని ఛార్జర్లు ప్రమాదకరమైనవే. ఎల్లప్పుడూ భద్రతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయండి. మీ ఛార్జర్‌ లేదా పరికరంపై ఉన్న CRS గుర్తు కేవలం గుర్తు కాదు, అది భద్రతా చిహ్నం. దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు,” అని పేర్కొంది.

ఈ పోస్టులో ఇంకా, CRS గుర్తు లేని ఛార్జర్లు(Phone Charger) వాడటం ద్వారా ఫోన్‌ దెబ్బతినే ప్రమాదం మాత్రమే కాకుండా, వినియోగదారుడి ప్రాణ భద్రతకు కూడా ముప్పు ఏర్పడవచ్చని హితవు పలికింది. కాబట్టి వినియోగదారులు తక్కువ ధరకు లభించే నకిలీ ఛార్జర్లకు ఆకర్షితులు కాకుండా, ప్రామాణిక బ్రాండ్‌లు, సర్టిఫైడ్ ఉత్పత్తులు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com