WPL 2026 రిటెన్ష‌న్ లిస్ట్ ఇదే..

- November 06, 2025 , by Maagulf
WPL 2026 రిటెన్ష‌న్ లిస్ట్ ఇదే..

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (WPL) 2026 కోసం అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ సీజ‌న్ క‌న్నా ముందు వేలాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఢిల్లీ వేదిక‌గా న‌వంబ‌ర్ 27న‌ డ‌బ్ల్యూపీఎల్ వేలం జ‌ర‌గ‌నుంది.ఈ క్ర‌మంలోనే అన్ని జ‌ట్లు త‌మ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల జాబితాను విడుద‌ల చేశాయి.

నిబంధ‌నల ప్ర‌కారం ప్ర‌తి ఫ్రాంచైజీ కూడా ఐదుగురు ప్లేయ‌ర్ల‌ను అట్టి పెట్టుకునే వీలుంది. ఇందులో ముగ్గురు భార‌త ప్లేయ‌ర్లు కాగా మ‌రో ఇద్ద‌రు విదేశీ ఆట‌గాళ్లు. వీరిలో క‌నీసం ఒక్క‌రు అన్ క్యాప్డ్ భార‌త ప్లేయ‌ర్ అయి ఉండాలి.

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ప‌రుగుల వ‌ర‌ద పారించి టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట‌ర్‌ లారా వోల్వార్డ్ట్ ను గుజ‌రాత్ జెయింట్స్ వేలానికి విడిచిపెట్టింది. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే రిటెన్ చేసుకోవ‌డానికే అనుమ‌తి ఉన్న నేప‌థ్యంలో గుజ‌రాత్ ఆసీస్‌ ద్వయం బెత్ మూనీ, ఆష్లీ గార్డనర్‌ను ఎంచుకుంది.

టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన దీప్తి శ‌ర్మ కూడా వేలానికి వ‌చ్చింది. ఇక ఊహించినట్లుగానే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలి వర్మ, రిచా ఘోష్, జెమిమా రోడ్రిగ్స్ వంటి ఇతర భార‌త స్టార్ ప్లేయ‌ర్ల‌ను జ‌ట్లు నిలుపుకున్నాయి.

ముంబై ఇండియన్స్..
నాట్-స్కైవర్ బ్రంట్ (రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 2.5 కోట్లు), హేలీ మాథ్యూస్ (రూ.1.75 కోట్లు), అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి), జి కమలినీ (రూ.50 లక్షలు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
స్మృతి మంధాన (రూ.3.5 కోట్లు), రిచా ఘోష్ (రూ.2.75 కోట్లు), ఎల్లీస్ పెర్రీ (రూ.2 కోట్లు), శ్రేయంక పాటిల్ (రూ.60 లక్షలు)

గుజరాత్ జెయింట్స్..                                                                                                           ఆష్లీ గార్డ్నర్ (రూ.3.5 కోట్లు), బెత్ మూనీ (రూ.2.5 కోట్లు)

యుపి వారియర్జ్..                                                                                                               శ్వేతా సెహ్రావత్ (రూ.50 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్..
జెమిమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ.2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (రూ.2.2 కోట్లు), మారిజాన్ కాప్ (రూ. 2.2 కోట్లు), నికి ప్రసాద్ (రూ. 50 లక్షలు)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com