'సినిమా రివ్యూ:: ‘ది గర్ల్ ఫ్రెండ్’.!

- November 07, 2025 , by Maagulf
\'సినిమా రివ్యూ:: ‘ది గర్ల్ ఫ్రెండ్’.!

రష్మిక మండన్నా, దీక్షిత్ శెట్టి కాంబినేషన్‌లో నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన సినిమానే ‘ది గర్ల్ ఫ్రెండ్’. అనూ ఇమ్మాన్యుయేల్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. సినిమా విడుదలకి ముందు రాహుల్ రవీంద్రన్ భార్య డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి చేసిన రచ్చ ఈ సినిమాకి ఓ స్పెషల్ ప్రమోషన్ అయ్యింది. అయితే, ఆ ప్రమోషన్ సినిమా సక్సెస్‌కి యూజ్ అయ్యిందా.? రచ్చగానే మిగిలిందా.? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

ఒకే కాలేజీలో పీజీలో రెండు డిఫరెంట్ కోర్సుల్లో చదువుతుంటారు ‘భూమా దేవి అలియాస్ భూమా (రష్మిక మండన్నా), విక్రమ్ (దీక్షిత్ శెట్టి). ఒక రోజు రాత్రి స్నేహితురాలితో కలిసి బయటికి వెళ్లిన భూమా అనుకోని కారణాలతో పోలీసులకు చిక్కుతుంది. అక్కడికి వచ్చిన విక్రమ్ అండ్ అతని స్నేహితులు పోలీసుల్ని కొట్టి భూమాని రక్షిస్తారు. తర్వాత పోలీసులతో తన్నులు తిని కాలేజీకి వచ్చిన విక్రమ్‌పై భూమా కన్‌సన్ చూపిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేసి సపర్యలు చేస్తుంది. దాంతో ఆమెలో తన అమ్మని చూసుకున్న విక్రమ్, తర్వాత ఆమెతో ప్రేమలో పడతాడు. మెల్ల మెల్లగా భూమా కూడా విక్రమ్‌ని ప్రేమిస్తుంది. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరిద్దరి ప్రేమ దారి ఎటు మళ్లింది.? ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయ్ ఈ గర్ల్ అండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమికులకి... తెలియాలంటే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు:

టాలీవుడ్‌లో స్టార్ ‌డమ్ వున్న హీరోయిన్లలో రష్మిక మండన్నా ఒకరు. అందులో నో డౌట్. అయితే, ఈ సినిమా రష్మిక కెరీర్‌కి ఎంత మాత్రం యూజ్ ఫుల్ అనేది ఆమెకే తెలియాలి. ఆ సంగతి పక్కన పెడితే, భూమా పాత్రలో తన వంతు న్యాయం చేసిందనే చెప్పాలి. దీక్షిత్ శెట్టి ‘దసరా’ సినిమాలో మాస్ లుక్స్‌లో సూపర్బ్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు. అందుకు ఏమాత్రం తగ్గకుండా క్లాసీ లుక్స్‌తో ఈ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నాడు. మంచి స్కోపున్న పాత్రే దీక్షిత్ శెట్టికి దక్కింది. తదుపరి పాత్ర దుర్గ. ఈ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ బాగా నటించింది. చాలా అందంగా బొమ్మలా కనిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత అనూకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. అలాగే, రోహిణి, రావు రమేష్ పాత్రలు తర్వాత ఈ సినిమాలో చెప్పుకోదగ్గ కీలక పాత్రలు. అయితే, ఆ పాత్రల్ని ఏమంత ఆకట్టుకునేలా చెప్పుకునేంతలా డిజైన్ చేయలేదు డైరెక్టర్. మిగిలిన పాత్రధారులు ఓకే.

సాంకేతిక వర్గం పనితీరు:

చాలా చాలా లవ్ స్టోరీస్ చూశాం. వాటిలో కొన్ని జెన్యూన్ ప్రేమ కథలు. ఇంకొన్ని ఫన్నీ ప్రేమకథలు.. మరికొన్ని సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా చాలా  రకాల ప్రేమ కథలే చూసేశాం గతంలో. అయితే, ఈ ప్రేమ కథని ఎలా డిఫైన్ చేయాలి. పీజీ విద్యార్లులు కాలేజీకి ఎందుకు వెళ్లాలి.? చదువుకోవడానికి. కానీ, ఇక్కడ ఏం చేశారు.?  ఇదేమని అడిగిన తల్లి తండ్రులకు కాలేజీ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ అయిన పాత్ర ఏం చెప్పింది.? దీంతో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్లు సమాజానికి.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపూ.. చూసేసి బయటికొచ్చేశాకా కూడా ఆడియన్స్ మదిలో మెదులుతాయ్. ఏ క్యారెక్టర్‌కీ జస్టిఫికేషన్ ఇవ్వకుండానే సినిమాని ఎండ్ చేసేశాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ ఓకే. కానీ, చాలా సన్నివేశాల్లో హీరోయిన్ ముఖం మీద కెమెరా పెట్టి జూమ్‌లో ముఖాలు చూపించేయడం ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకూ ఓకే. కానీ, సెకండాఫ్ చాలా బోర్ కొట్టించేస్తుంది. చాలా సన్నివేశాలను చూస్తే వల్గర్ ఫీల్ రాదు కానీ, ఇమేజినేషన్ మాత్రం అదే ఫీల్ కలుగుతుంది. మ్యూజిక్ పరంగా చూసినా పాటలు కథానుగుణంగా వస్తాయ్.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమా ఆధ్యంతం బ్రైట్‌గా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: 

కాన్సెప్ట్ కొత్తదే.. రష్మిక రోల్ కూడా కొత్తగా వుంది. కానీ, హండ్రెడ్ పర్సంట్ ఇవి ప్లస్ పాయింట్స్ అని మాత్రం చెప్పలేం.

మైనస్ పాయింట్స్:

కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, కథనం డీల్ చేసిన విధానం బాగా లేదు. ఏ క్యారెక్టర్‌కీ పర్టిక్యులర్ జస్టిఫికేషన్ ఇచ్చింది లేదు. క్లైమాక్స్‌లో హీరోయిన్ చేత చెప్పించిన డైలాగులు కూడా ఇబ్బందికరంగా వుంటాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే మైనస్ పాయింట్స్ వున్నాయ్ ఈ సినిమాలో.

చివరిగా:

‘ది గర్ల్ ఫ్రెండ్’ జస్ట్ ఓ టైమ్ పాస్ కూడా కాదు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు.? ఏం ఇచ్చారు.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com