అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్

- November 07, 2025 , by Maagulf
అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం 25 సంవత్సరాలుగా పునరావృతమవుతున్న ఒక అరుదైన రైట్ నెక్ లింఫాంజియోమా కేసును విజయవంతంగా చికిత్స చేసి రోగి జీవితానికి కొత్త ఊపిరి ఇచ్చింది.రోగి గతంలో 2010, 2015 మరియు 2025లో మూడు సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ, వాపు మళ్లీ రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. గడ్డ పెరిగి మెడ కదలికలు కష్టమవడం, శ్వాసలో ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చాయి.

లింఫాంజియోమా అనేది లింఫ్ మరియు రక్తనాళాల అసాధారణ పెరుగుదల వల్ల ఏర్పడే అరుదైన మాల్ఫార్మేషన్. ఇది తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే మెడలో కీలక నరాలు మరియు అవయవాల సమీపంలో ఉండడం వలన శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంది.

మెడలో కీలకమైన నరాలు, రక్తనాళాలు, అన్ననాళం (Esophagus) మరియు శ్వాసనాళం (Trachea) సమీపంలో లింఫాంజియోమా ఉండటం, గత శస్త్రచికిత్సల వల్ల ఏర్పడిన తీవ్రమైన మచ్చల కణజాలం (Scar Tissue) కారణంగా ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టంగా మారింది. రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం, సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డా.రాహుల్ లక్ష్మీనారాయణ మరియు కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. వెంకట్ పవన్ , అనస్తేషియాలజీ విభాగం డా. వేణుగోపాల్ గారి  నేతృత్వంలో బహుళ నిపుణుల బృందం 5 గంటలు పాటు శ్రమించి అత్యంత క్లిష్టమైన రికన్‌స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. లింఫాంజియోమా యొక్క పరిమాణం 5కేజీలు ఉన్నది.

డా.రాహుల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, "పునరావృత లింఫాంజియోమాలు సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడినవి. తీవ్రమైన రక్తస్రావం, నరాల గాయాలు మరియు అంతర్గత అవయవాల గాయాల ప్రమాదం అధికంగా ఉన్నప్పటికీ, ఆధునిక ఇమేజింగ్ మరియు ఖచ్చితమైన ప్రణాళికతో మేము ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా అద్భుతమైన ఫలితాన్ని సాధించాము," అని వివరించారు.
డా. వెంకట్ పవన్ మాట్లాడుతూ, "మునుపటి ఆపరేషన్ల వల్ల ఏర్పడిన మచ్చల కారణంగా కణజాల పొరలను గుర్తించడం కష్టమైంది. ప్రధాన నరాలు, రక్తనాళాలు మరియు శ్వాసనాళం దెబ్బతినకుండా అత్యంత ఖచ్చితత్వంతో (Surgical Precision) ప్రతి దశనూ పూర్తి చేయగలిగాము. మా బృందం యొక్క అద్భుతమైన సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైంది," అని తెలిపారు.

అనంతరం రోగి మాట్లాడుతూ “25 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడ్డాను. హోమియోపతి, నూనె మసాజ్‌లు, స్థానిక చికిత్సలు అన్నీ ప్రయత్నించాను. ఉపశమనం దొరకకపోగా, సమయాన్ని, డబ్బును మాత్రమే వృథా చేసుకున్నాను. నేను అందరికీ చెప్పదలిచింది ఒక్కటే — ఇలాంటి సమస్యలకి నిర్ధారణ లేని వైద్యం చేయించకండి. అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి, సరైన చికిత్స పొందండి. అదే నా జీవితాన్ని కాపాడింది.”

శస్త్రచికిత్స అనంతరం రోగి చాలా వేగంగా కోలుకుని, కేవలం మూడవ రోజుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రోగికి మెడ కదలికలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయి మరియు ఎటువంటి నరాల బలహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు లేవు.

మెడికవర్ హాస్పిటల్స్ యొక్క వైద్య నైపుణ్యం, అధునాతన సాంకేతికత మరియు బహుళ శాఖల సమన్వయం ద్వారా అరుదైన మరియు క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా చికిత్స చేయగలం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com