ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- November 08, 2025
దోహా: ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాపై పోరాడటానికి కలిసి రావాలని గ్లోబల్ ఫండ్ చైర్పర్సన్ రోస్లిన్ మొరాటా పిలుపునిచ్చారు. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నంలో ఖతార్ విలువైన భాగస్వామిగా ఉందని ప్రశంసించారు. ప్రపంచ ఆరోగ్య ఫైనాన్సింగ్‌లో ఖతార్ ప్రాముఖ్యత పెరుగుతుందని కొనియాడారు.
దోహాలో జరిగిన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ ఫండ్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆరోగ్య ఫలితాలను సాధించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ ఫౌండేషన్లు మరియు పౌర సమాజాన్ని ఏకం చేసే "ప్రత్యేక భాగస్వామ్యం"గా మొరాటా అభివర్ణించారు.
2002లో స్థాపించబడినప్పటి నుండి మధ్య-ఆదాయ దేశాలలో $70 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. 70 మిలియన్లకు పైగా ప్రాణాలను కాపాడిందని పేర్కొన్నారు. మూడు ప్రధాన వ్యాధుల మరణాలను 63 శాతం తగ్గించిందని వివరించారు. 2016లో ఖతార్ దాతగా చేరిందని, అప్పటి నుండి దాని విరాళాలను క్రమంగా పెంచిందని మొరౌటా వెల్లడించారు.
2030 నాటికి ఎయిడ్స్, క్షయ మరియు మలేరియాను నిర్మూలించే దిశగా పురోగతిని కొనసాగించడానికి $18 బిలియన్లను సేకరించాలని ప్రయత్నిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







