ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- November 08, 2025
యూఏఈ: ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్ అమల్లోకి వచ్చాయి. యూఏఈలోని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వ్యవస్థలకు యూజర్ యాక్సెస్ ఇచ్చే ముందు ముందస్తుగా వారిని పరీక్షించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యాపార కేంద్రాలు మంత్రిత్వ శాఖ సేవలను పొందాలనుకునే సంస్థలు మరియు వ్యక్తులకు మద్దతు అందించే ప్రైవేట్ రంగ సంస్థలను రిఫర్ చేస్తాయని పేర్కొంది.
ఈ కేంద్రాలు కస్టమర్ డేటా గోప్యతను కాపాడాలని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపితమైతే చట్టపరమైన ఆంక్షలు మరియు జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది.
మోహ్రేకు తప్పుడు డేటా, డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని అందించడం నేరంగా పరిగణించనున్నారు. వ్యాపార కేంద్ర ఉద్యోగులు మంత్రిత్వ శాఖ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







