ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- November 10, 2025
మస్కట్: ఒమన్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక శిక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు చిన్నారి దివ్యాంగుల సంఘం సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ వ్యవస్థ ను ఏర్పాటు చేసి తద్వారా వారిలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను పెంపొందించనున్నారు. అలాగే, దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వీరు దృష్టి పెట్టనున్నారు.
ఈ ఒప్పందంపై సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ రషీద్ బిన్ అహ్మద్ అల్ షంసీ మంత్రిత్వ శాఖ తరపున సంతకం చేశారు. అసోసియేషన్ తరపున సంఘం డైరెక్టర్ల బోర్డు ఛైర్పర్సన్ ఖదీజా బింట్ నాసర్ అల్ సాతి దీనిపై సంతకం చేశారు.
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజ అవగాహనను పెంచడానికి మరియు వారికి సమాజంలో తగిన భాగస్వామ్యాన్ని అందించడానికి దోహదపడేలా సమావేశాలు, సెమినార్లు మరియు వర్క్‌షాప్ లు సహా ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







