కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- November 10, 2025
కువైట్: కువైట్ లో సేవ మరియు భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ అల్-సబా వెల్లడించారు. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన ఇనిషియేటివ్స్ ఫోరమ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు ఈ సంస్కరణల సానుకూల ఫలితాలను త్వరలో అనుభవిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంట్రీ వీసాలను జారీ చేయడంలో కువైట్ సామర్థ్యాన్ని షేక్ ఫహాద్ హైలైట్ చేశారు. ఈ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని, ఐదు నిమిషాల్లోనే ఆమోదం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా సహకారంపై స్పందిస్తూ.. గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం ఉందని షేక్ ఫహాద్ చెప్పారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఉమ్మడి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. కువైట్ దాని సముద్ర మరియు భూ సరిహద్దులను కవర్ చేసేలా అధునాతన రాడార్ వ్యవస్థను కలిగి ఉందని షేక్ ఫహాద్ తెలియజేశారు. ఇది దేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







