తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!

- November 10, 2025 , by Maagulf
తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!

రియాద్: తైఫ్‌లోని అల్-హదా రోడ్డును మూడు రోజుల పాటు రెండు దిశలలో మూసివేస్తారు. నేటి నుండి బుధవారం వరకు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని స్పెషల్ ఫోర్సెస్ ఫర్ రోడ్ సెక్యూరిటీ ప్రకటించింది.

నిర్వహణ పనులు నిర్వహిస్తున్నప్పుడు వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి ప్రారంభంలో రోడ్స్ జనరల్ అథారిటీ (RGA), రోడ్స్ సెక్యూరిటీతో సమన్వయంతో అనేక వారాల పాటు నిర్వహణ పనుల కోసం అల్-హదా రోడ్డును మూసివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com