'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- November 10, 2025
దోహా: విద్యార్థులకు ఖతార్ నేషనల్ లైబ్రరీ గుడ్ న్యూస్ చెప్పింది. 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించినట్లు తెలిపింది. ఉద్యోగ అవకాశాలతోపాటు స్టడీ రీసెర్చ్ అభ్యర్థులకు ఇది మేలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక స్థలం నిశ్శబ్ద, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందని తెలిపింది.
నైట్ స్టడీ స్పేస్ శుక్రవారం నుండి బుధవారం వరకు, రాత్రి 8:00 - ఉదయం 6:00 వరకు మరియు గురువారం రాత్రి 8:00 - ఉదయం 9:00 వరకు తెరిచి ఉంటుంది. అలాగే, శుక్రవారం ఉదయం కూడా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లైబ్రరీ సభ్యత్వం కలిగిన 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సభ్యులకు లైబ్రరీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంటుందని ఖతార్ నేషనల్ లైబ్రరీలో పబ్లిక్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ కటియా మెదవార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







