ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- November 13, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ లో దృష్టి లోపాలను గుర్తించేందుకు విస్తృతంగా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) సహకారంతో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MEHE) ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఇటీవల ట్రైనింగ్ వర్క్ షాప్ లను నిర్వహించారు.
తీవ్రమైన కంటి సమస్యలు ఉన్నవారిని సంబంధిత సిబ్బంది ఆరోగ్య కేంద్రాలు మరియు ఆసుపత్రులకు రిఫర్ చేస్తారని MoPHలోని నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ షేక్ డాక్టర్ మొహమ్మద్ హమద్ అల్ థాని తెలిపారు. స్కూలింగ్ దశలో దృష్టి సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించడం అనేది కీలకమైనదని పేర్కొన్నారు. ఇది సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పాఠశాల వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుని నిర్వహిస్తున్న కార్యక్రమని తెలిపారు.
పిల్లలలో దృష్టి సమస్యలను ముందస్తుగా గుర్తించడం దృష్టి లోపాన్ని నివారించడంలో ఒక ముఖ్యమైన దశ అని PHCC కన్సల్టెంట్ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ హలా అల్ ఖాదీ వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడంతోపాటు మంచి కంటి చూపు కోసం పిల్లలు పిల్లలు ఇండోర్ మరియు ఔట్ డోర్ గేమ్స్ ఆడాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







