డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- November 13, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ & ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంఈఐఎల్ డైరెక్టర్ మరియు సేవా కార్యక్రమాల ప్రముఖురాలు సుధా రెడ్డి, ప్రపంచ తెలుగు ఐటీ సదస్సు (డబ్ల్యూటిఐటిసి ) ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా కలిసి, ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు 2025 కౌంట్‌డౌన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఇన్నోవేషన్ కేంద్రం టి-హబ్ లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
డిసెంబర్ 12–14, 2025 తేదీలలో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరగనున్న ఈ అంతర్జాతీయ ఐటీ మహాసభలులో 100 కంటే ఎక్కువ దేశాల తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...“తెలంగాణ ఆవిష్కరణలలో భారతదేశానికి దారి దీపంలా నిలిచింది. మన తెలుగు టెక్నాలజీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక మార్పులకు దారితీస్తున్నారు.డబ్ల్యూటిఐటిసి 2025 దుబాయ్ కాన్ఫరెన్స్ మన గ్లోబల్ ప్రతిభ, ఇన్నోవేషన్ మరియు కలబోరేషన్కు వేదికగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు ఐటీ మిషన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తుంది,” అని తెలిపారు.
డబ్ల్యూటిఐటిసి ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ... “టి-హబ్‌లో ఈ కౌంట్‌డౌన్ ప్రారంభంతో, చారిత్రాత్మక గ్లోబల్ ఈవెంట్ కోసం మా పనులు తుది దశకు చేరాయి. డబ్ల్యూటిఐటిసి 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నాలజీ నిపుణులు, ఇన్నోవేటర్లు, ఇన్వెస్టర్లు ఒక్క జెండా కింద ఏకం అవుతారు. ఇది గ్లోబల్ టెక్ కథనాన్ని కొత్త దిశలో మలుస్తుంది,” అని అన్నారు.
దుబాయ్ ఎడిషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడతాయి.
అలాగే డబ్ల్యూటిఐటిసి గ్లోబల్ ఇన్వెస్టర్ పిచ్, స్టార్టప్ & ఇన్నోవేషన్ ఎక్స్పో, విమెన్ ఇన్ టెక్ సమ్మిట్, అలాగే 2026–2028 గ్లోబల్ లీడర్షిప్ టీమ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరుగనున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ టెక్నాలజీ, స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ప్రాధాన్య కార్యక్రమాలను సంయుక్తంగా ప్రదర్శించనున్నాయి.ఈ కార్యక్రమంలో డబ్ల్యూటిఐటిసి సభ్యులు యమిని, మనసా, అక్షిత సింగారం, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు 2025 డిసెంబర్ 12–14 తేదీలలో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరుగుతుంది. ఈ వేదికలో ప్రపంచ తెలుగు ప్రతిభ, ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్ను ఒక్కచోట చేర్చి, గ్లోబల్ తెలుగు ఐటీ సమాజానికి కొత్త స్ఫూర్తి నింపనుంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







