$1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- November 13, 2025
యూఏఈ: దుబాయ్‌లో ఉన్న ఒక భారతీయ ప్రవాసి 522 సిరీస్‌లో టికెట్ నంబర్ 2242తో $1 మిలియన్ గెలుచుకున్నారు. సదరు భారతీయ బ్యాంకర్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో తాజా డాలర్ మిలియనీర్ అయ్యాడు.
1998 నుండి యూఏఈ, ఒమన్ మధ్య నివసిస్తున్న అతుల్ రావుకు, ఈ విజయం ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపిస్తుంది. “నాకు కాల్ వచ్చినప్పుడు, ఎవరో నన్ను చిలిపిగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నాను. ఈ రోజుల్లో మాకు చాలా స్పామ్ ఇమెయిల్‌లు మరియు మెసేజులు వస్తున్నాయి, నమ్మడం కష్టంగా ఉంది, ”అని ఒక బ్యాంకులో పనిచేస్తున్న రావు అన్నారు.
ముంబైలో జన్మించిన బ్యాంకర్ తన పుట్టినరోజున, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు తన అదృష్ట టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అతను తన స్నేహితుడి వివాహం కోసం బాలికి విమానంలో వెళుతుండగా, తన అదృష్టాన్ని పరీక్షించుకొని టిక్కెట్ కొన్నట్లు తెలిపాడు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని దాతృత్వానికి, తెలివైన పెట్టుబడుల కోసం కొంత ఆస్తిని కొనాలని యోచిస్తున్నట్లు అతుల్ రావు చెప్పారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







