దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- November 14, 2025
దోహా: ఫార్మా కంపెనీలు మెడిసిన్ ఉత్పత్తుల గురించి అవసరమైన సమాచారాన్ని బ్రెయిలీలో ప్యాకేజింగ్‌పై ముద్రించాలని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. నవంబర్ 2027 నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మెడిసిన్ ఉత్పత్తులకు ఇది తప్పనిసరి అని తెలిపారు. మెడిసిన్ పేరు, అందులోని కెమికల్ కాంబినేషన్స్ వివరాలను తప్పనిసరిగా మెడిసిన్స్ పై అరబిక్ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ బ్రెయిలీలో ముద్రించి, ప్రచురించాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలో హెల్త్‌కేర్ రెగ్యులేటరీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ ఘనిమ్ అలీ అల్ మన్నాయ్ తెలిపాడు. ఈ నిర్ణయం అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారికి మెడిసిన్ ఉత్పత్తులను సురక్షితంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తుందని డాక్టర్ అల్ మన్నాయ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







