యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- November 14, 2025
యూఏఈః యూఏఈలో ఇప్పటివరకు జరిగిన 100 మిలియన్ దిర్హాముల అతిపెద్ద లాటరీ చెల్లింపు తర్వాత, తదుపరి మల్టీ మిలియనీర్ ను త్వరలోనే చూడవచ్చా? అంటే అవుననే అంటున్నారు యూఏఈ లాటరీ కమర్షియల్ గేమింగ్ డైరెక్టర్ స్కాట్ బర్టన్.100 మిలియన్ దిర్హాముల గ్రాండ్ ప్రైజ్ గెలవడం ఖచ్చితంగా అసాధారణమైనది అయినప్పటికీ, ప్రతి డ్రా లో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. కాబట్టి మనం ఎప్పుడైనా మరొక పెద్ద విజేతను చూడవచ్చని పేర్కొన్నారు.
29 ఏళ్ల అబుదాబి నివాసి అనిల్‌కుమార్ బోల్లా గత నెలలో ఖచ్చితమైన విన్నింగ్ కాంబినేషన్‌లోని ఏడు సంఖ్యలను సరిపోల్చడంతో 100 మిలియన్ దిర్హాములను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే, ఎవరైనా జాక్‌పాట్ కొట్టిన తర్వాత కూడా డ్రాలలో విజయావకాశాలు మారవు అని బర్టన్ అన్నారు. ప్రతి డ్రా పూర్తిగా స్వతంత్రంగా ఉంటుందని, అంటే ఎవరైనా ఎప్పుడైన ప్రతి టికెట్ గెలిచే అవకాశం ఉంటుందన్నారు. 8.8 మిలియన్లలో బిగ్ విజేతగా నిలిచే అవకాశం ఒక్కటే ఉన్నా..డ్రా ఫార్మాట్‌లోని సంఖ్యల మొత్తం కలయికపై అది ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.
అయితే, ఇటీవల యూఏఈ లాటరీ టిక్కెట్ల విక్రయంలో పెరుగుదల నమోదవుతుందని స్కాట్ బర్టన్ తెలిపాడు. గెలుపై నమ్మకం, విజేతల స్టేట్ మెంట్స్ ఈ పెరుగుదలకు కారణమని వెల్లడించారు.ప్రతి సారి విజయం కొత్త వారిని ఆకర్షిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







