సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!

- November 14, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!

రియాద్ః సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై పెట్టే ఖర్చు బారీగా పెరుగుతోంది. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో సౌదీ అరేబియా పరిశోధన మరియు అభివృద్ధిపై పెట్టే ఖర్చు 30.4 శాతం పెరిగి SR29.48 బిలియన్లకు చేరుకుంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) గురువారం విడుదల చేసిన 2024 పరిశోధన మరియు అభివృద్ధి గణాంకాల ఫలితాల్లో ఈ మేరకు వెల్లడించింది. మొత్తం వ్యయంలో 40.3 శాతం వాటాతో SR11.87 బిలియన్లతో వ్యాపార రంగం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం 40.2 శాతం వాటాతో 11.86 బిలియన్లను ఖర్చు చేసింది. ఉన్నత విద్యా రంగంలో 19.5 శాతం వాటాతో 5.75 బిలియన్లను ఖర్చు చేశారు. పరిశోధన మరియు అభివృద్ధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య సైతం 14.7 శాతం పెరిగి 56,593 మందికి చేరుకుంది.
ప్రభుత్వ రంగం నుండి పరిశోధన మరియు అభివృద్ధి నిధులు SR15.69 బిలియన్లకు చేరుకున్నాయని, ఇది మొత్తం నిధులలో 53.2 శాతానికి సమానమని అథారిటీ నివేదించింది. వ్యాపార రంగం నుండి నిధులు 12.1 బిలియన్లు  (41.1 శాతం) కాగా, ఉన్నత విద్యా రంగం నుండి నిధులు మొత్తం పరిశోధన మరియు అభివృద్ధి నిధులలో 5.7 శాతం వాటాతో 1.69 బిలియన్లకు చేరుకున్నాయని వెల్లడించారు.
పరిశోధన మరియు అభివృద్ధిలో పనిచేస్తున్న వారి సంఖ్య 56,600 కు చేరుకుందని, ఇది వార్షిక వృద్ధి రేటు 14.7 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. 2023తో పోలిస్తే పరిశోధకుల సంఖ్య 12.8 శాతం పెరిగి, మొత్తం పరిశోధకుల సంఖ్య 41,000 కు పైగా పెరిగింది. ఉన్నత విద్యా రంగం 40,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది. ఇది మొత్తం శ్రామిక శక్తిలో 71.3 శాతం. దీని తరువాత 12,000 మందికి పైగా ఉద్యోగులతో వ్యాపార రంగం ఉంది.  ఇది మొత్తం శ్రామిక శక్తిలో 22 శాతాన్ని కలిగి ఉంది. ఆ తరువాత ప్రభుత్వ రంగం సుమారు 4,000 మంది ఉద్యోగులు లేదా 6.7 శాతం ఉన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com