డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- November 14, 2025
కువైట్ః కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) పర్యవేక్షణలో కువైట్ జియోపార్క్ ప్రాజెక్ట్ డిసెంబర్ చివరిలో ప్రారంభం కానుంది. ఇది పర్యాటకం మరియు పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తుందని సమాచార, సంస్కృతి శాఖల మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో మరియు కువైట్ సహజ వారసత్వాన్ని ప్రదర్శించడంలో జియోపార్క్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
జియోపార్క్ కువైట్ జాతీయ పర్యాటక రంగానికి అదనంగా ప్రాతినిధ్యం వహిస్తుందని, సందర్శకులకు సాంస్కృతిక, పర్యావరణ మరియు వినోద అనుభవాలను అందిస్తుందని మంత్రి అల్-ముతైరి అన్నారు. కువైట్ పర్యావరణం మరియు ప్రత్యేకమైన భౌగోళిక చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా కువైట్ స్థానాన్ని బలోపేతం చేయడానికి అనేక పర్యాటక ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







