సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- November 14, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అల్ ఉకైర్ బీచ్ నవంబర్ 25 నుండి 29 వరకు ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన రాంలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంతో తీరప్రాంతం మొత్తం జనం సందడి చేయనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలు జరుగుతాయి. టోర్నమెంట్ విజేతలకు SR200000 కంటే ఎక్కువ నగదు బహుమతులను అందజేస్తారు. అందరికి ప్రవేశం ఉచితం.
అల్-అహ్సా గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ బదర్ ఆధ్వర్యంలో జరిగే రంలియా వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) నిర్వహించే సాకర్, వాలీబాల్ మరియు హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహిస్తారు. ఇంటరాక్టివ్ బీచ్ గేమ్‌లతో కూడిన పెద్ద ఫ్యాన్ జోన్, యోగా మరియు ఫిట్‌నెస్ క్లాసెస్, మ్యూజిక్ అందించే వెల్‌నెస్ జోన్ మరియు విభిన్న వంటకాలను అందించే క్యూరేటెడ్ ఫుడ్ కోర్టులు అందరిని ఆహ్వానం పలుకుతున్నాయి. అల్-ఖోబార్ మరియు అల్-హోఫుఫ్ నుండి ఉచిత షటిల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







