ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!

- November 15, 2025 , by Maagulf
ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!

దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్లలో మూడు తప్పనిసరి సబ్జెక్టులు అరబిక్, ఇస్లామిక్ మరియు ఖతారీ చరిత్రలపై ఉపాధ్యాయ సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ నిర్ణయం చర్య ప్రైవేట్ విద్య నాణ్యతను మెరుగుపరచడం మలక్ష్యంగా పెట్టుకుందని విద్యామంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  
ఉపాధ్యాయులు విద్యా ప్రక్రియకు మూలస్తంభాలని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నామా తెలిపారు. ఉపాధ్యాయులు లేకుండా, ఏ విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడంతోపాటు వారి వృత్తిపరమైన పనితీరును అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి, వారి బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి రూపొందించిన అభివృద్ధి సాధనం అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com