ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- November 15, 2025
దోహా: ఖతార్ లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్లలో మూడు తప్పనిసరి సబ్జెక్టులు అరబిక్, ఇస్లామిక్ మరియు ఖతారీ చరిత్రలపై ఉపాధ్యాయ సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ నిర్ణయం చర్య ప్రైవేట్ విద్య నాణ్యతను మెరుగుపరచడం మలక్ష్యంగా పెట్టుకుందని విద్యామంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉపాధ్యాయులు విద్యా ప్రక్రియకు మూలస్తంభాలని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్ నామా తెలిపారు. ఉపాధ్యాయులు లేకుండా, ఏ విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఉపాధ్యాయులకు మద్దతు ఇవ్వడంతోపాటు వారి వృత్తిపరమైన పనితీరును అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఉపాధ్యాయుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి, వారి బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి రూపొందించిన అభివృద్ధి సాధనం అని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







