హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- November 15, 2025
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్–విజయవాడ మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో నాలుగు వరుసల హైవే నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
హైవే దాటే బైక్ రైడర్లు, పాదచారులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ప్రతీ ముఖ్యమైన జంక్షన్లో అండర్‌పాస్ నిర్మించాలనే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్రమంలో మొత్తం 60 అండర్‌పాస్‌లు నిర్మించాలనే డీపీఆర్‌ను ‘ఐకాన్స్’ సంస్థ సిద్ధం చేసి ఎన్హెచ్ఏఐకి అందించింది. దండుమల్కాపురం (యాదాద్రి జిల్లా) నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వరకు 231.32 కిలోమీటర్ల పరిధిలో ఆరు వరుసల నేషనల్ హైవేను అభివృద్ధి చేయనున్నారు. ఈ విస్తృత మార్గంలో:
60 అండర్‌పాస్‌లు
- 17 వీయూపీలు (Vehicular Underpasses)
- 35 ఎల్వీయూపీలు (Light Vehicular Underpasses)
- 8 ఎస్వీయూపీలు (Small Vehicular Underpasses)
- 10 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
4-లేన్ హైవేలోని లోపాలు ఇప్పుడు సరిచేస్తున్నారు
నాలుగు వరుసల హైవే నిర్మాణ సమయంలో రాజకీయ జోక్యం, అనధికార మార్పులు, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల అనేక ప్రమాద ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ తప్పిదాలను గుర్తించిన ఎన్హెచ్ఏఐ, ఆరు లేన్ల విస్తరణలో ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
అండర్‌పాస్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు పెరగడంతో:
- పాదచారులకు సురక్షిత మార్గం
- వాహనదారులకు నిర్భందమైన ట్రాఫిక్ రాకపోకలు
- ప్రమాదాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల
- అనుకునే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







