ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- November 15, 2025
హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ అరైవ్, అలైవ్ పేరిట చేబట్టిన కార్యక్రమం శుక్రవారం ఘనంగా మొదలయ్యింది. ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సినీతారల సమక్షంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమాన్ని డిజిపి శివధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించేలా ఉందని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నా రని, మరెంతో మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంవల్ల ప్రమా దాలను నివారించవచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు అనేది ఏ ఒక్కరి సమస్య కాదని, అందరికి సంబంధించిన సమస్యలని ప్రతీ కుటుంబం బాధ్యత తీసుకుని ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు.
ఎవరో చేసిన తప్పిదాల వల్ల అమాయకులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో ఏటా 800 హత్యలు జరుగుతుంటే రోడ్డు ప్రమాదాల ద్వారా పదింతలమంది చనిపోతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా యు వత హెల్మెట్ లేకుండా ద్వీచక్ర వాహనాలు నడపడం, సెల్ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపటం, ట్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలకు పోగోట్టుకుంటున్నారని, కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగుల్చుతున్నారని ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అరైవ్, అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు. ఇందులో రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన. పెంపొందించడం, నియమాలు కచ్చితంగా పాటించేలా చేయడం, వాహనదారులు బాధ్యతగా వుండేలా చేయడం, డ్రైవర్లు సవ్యంగా డ్రైవింగ్ చే సేలా చూడడం ఇందులో ముఖ్యమని డిజిప్ తెలిపారు.
డ్రైవింగ్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కనీనస్థాయికి త గ్గించగలుగు తామని డిజిపి తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లా డుతూ దేశంలో ప్రతి ఏడాది నాలుగున్నర జరుగుతున్నాయని, లక్షమందికిపైగా చనిపోతున్నారని, ఐదు లక్షల మందికి పైగా క్షతగాత్రులవు తున్నారని, హైదరాబాద్ నగరంలో మూడు వేల రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని, మూడు వందల మంది మృత్యువాత లక్షల రోడ్డు ప్రమాదాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హాస్యనటుడు బాబుమోహన్ మాట్లాడుతూ తాను ఎసిఐ కావాలనుకున్నానని కాని ఆ కోరిక తీరలేదని, జంబలకిడిపంబ సినిమాలో ఎస్ఐగా పాత్ర ధరించడంతో నా కోరిక తీరిందన్నారు. సమావేశంలో రోడ్ సేఫ్టీ విభాగం ఐజి రమేష్ నాయుడుతో పాటు సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, సినీ హీరోలు తేజా సజ్జా. శ్వూనంద్, సాయికుమార్, దర్శకుడు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాల నివారణపై రూపొందించిన చైతన్య కార్యక్రమాలు డాక్యుమెంటరీ ద్వారా ప్రదర్శించారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







