భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- November 15, 2025
తిరుమల: ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ చరణిని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు అభినందించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం చరణి శనివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తు లో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా పాల్గొని శ్రీచరణికి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







