నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- November 15, 2025
హైదరాబాద్: ఇటీవల ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి.ఫేక్ ఖాతాలతో ప్రజల్ని మోసగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే ఈమధ్య సైబర్ నేరగాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీలు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలను స సృష్టిస్తున్నారు. వారి పేరుతో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ పేరుతో నకిలీ ఖాతాలతో ప్రజలను మోసగించే మెసేజ్ లను పంపుతున్నారు.
తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తెలిపారు.ఆపదలో ఉన్నానని.. డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్ లు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి రూ.20వేలు పంపిమోసపోయారని చెప్పారు.
డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్ లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్ లు, మెసేజ్ లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







