ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- November 16, 2025
కువైట్ః కువైట్ లోని ఫర్వానియా ప్రాంతంలో భద్రతా అధికారులు రెండు చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించారు. ఈ మేకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆసియా జాతీయతకు చెందిన నలుగురు వ్యక్తులు భద్రతా అధకారులు అరెస్టు చేశారు..అనుమానితుడు లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇక రెండవ కేసులో, డబ్బుకు బదులుగా ప్రభుత్వ మందుల అక్రమ డెలివరీలో పాల్గొన్న నెట్వర్క్ను అధికారులు ఛేదించారు. అధికారులు ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తులో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఆసియా నివాసి తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుని మందులను దొంగిలించి నిందితులకు సరఫరా చేశాడని తేలింది. దీనితో ఈ కేసులో పాల్గొన్న మొత్తం వ్యక్తుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
అనుమానితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు స్వాధీనం చేసుకున్న మందులను సురక్షితంగా ఉంచడానికి మరియు డాక్యుమెంట్ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంతో సమన్వయంతో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







