అందుబాటులోకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్
- July 24, 2016
సెక్యూరిటీ డైరెక్టరేట్స్ ఎలక్ట్రానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ద్వారా వేగవంతమైన సర్వీసులు అందించడానికి సమాయత్తమయ్యాయి. ప్రతి గవర్నరేట్‌లోనూ వీటిని ఏర్పాటు చేశారు. సిటిజన్స్, రెసిడెన్స్ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ద్వారా క్రిమినల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళకుండా, ఎక్కడికక్కడ పలు సర్వీసులను పొందడానికి వీలుంటుందని జనరల్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్ఫర్మేషనల్ డిపార్ట్‌మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కల్నల్ రీద్ అల్ మోయెలి చెప్పారు. అదిలియాలోని మెయిన్ హెడ్ క్వార్టర్‌కి కూడా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వచ్చాయి. వీటితో ఇతర డైరెక్టరేట్ నుంచి వచ్చే ఫైళ్ళను కూడా ఇక్కడి నుంచి పరిష్కరించడానికి వీలవుతుందని అధికారులు చెప్పారు.2015లో 38,544 సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ కాండక్ట్ మరియు 20,683 జాబ్ అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు వివరించారు. ఇంటీరియర్ మినిస్టర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఆలోచనల నేపథ్యంలో సిటిజన్స్ మరియు రెసిడెంట్స్‌కి మెరుగైన సెక్యూరిటీ సర్వీసులను గవర్నరేట్ వెబ్‌సైట్ ద్వారా అందించగలుగుతున్నట్లు కల్నల్ రీద్ అల్ మొయిలి చెప్పారు. జూన్‌లో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ని సందర్శించి, సేవల్ని అందుకున్నవారి సంఖ్య ఇప్పటికే 1,762కి చేరుకుంది
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







