ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ లేదిక
- July 24, 2016
ఆగస్ట్ నుంచి, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఉండబోదని అబుదాబీ పోలీస్ వెల్లడించింది. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2010 నుంచి ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ అమల్లోకి వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదాల్ని ఇంకా తగ్గించే క్రమంలో, వాహనదారులకు జరీమానాలపై భయం పెంచేలా, రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండేలా చేసేందుకు జరీమానాలపై డిస్కౌంట్ తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత మే నెలలో 1837 మంది వాహనదారులు గంటకు 200 కిలోమీటర్ల పైబడి వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. 2016 తొలి మూడు నెలల్లో రోడ్లపై ప్రమాదాలు విపరీతంగా పెరిగాయి. దాంతో వాహనదారులకు అతి వేగంపై అప్రమత్తం చేసేందుకుగాను జరీమానాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని అబుదాబీ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జనరల్ ఆపరేషన్స్ - బ్రిగేడియర్ హుస్సేన్ అల్ హార్తి చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







