నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు

- November 17, 2025 , by Maagulf
నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు

దుబాయ్: దుబాయ్‌లో వాహనాలు మరియు మోటార్‌సైకిళ్ల వల్ల ఉత్పత్తి అయ్యే అధిక శబ్దాన్ని తగ్గించేందుకు దుబాయ్ పోలీసులు శబ్ద రాడార్లను మరింత విస్తరించేందుకు సిద్ధమయ్యారు. దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ స్మార్ట్ రాడార్ యంత్రాలను దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు.

ఈ చర్య, దుబాయ్‌లోని ప్రజల ప్రశాంతత, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు ప్రపంచంలో అత్యంత శాంతియుతంగా, నాగరికంగా నిలిచే నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తీసుకుంటున్న కృషిలో భాగంగా అమలు అవుతోంది.

దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్‌కు అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు.ఈ రాడార్ వ్యవస్థ ట్రాఫిక్ నిర్వహణలో భాగమైన స్మార్ట్ టెక్నాలజీగా పనిచేస్తుందని. “ఈ పరికరాలు శబ్ద స్థాయిలను ఖచ్చితంగా కొలుస్తాయి, మూలాన్ని గుర్తిస్తాయి, మరియు పరిమితి దాటినప్పుడు వీడియో సహా ఉల్లంఘనలను నమోదు చేస్తాయి” అని అన్నారు.

ఈ రాడార్లు అనవసరంగా హారన్ మోగించడం, అతిగా శబ్దం చేసే ఆడియో సిస్టమ్‌లను కూడా పర్యవేక్షిస్తాయి.అధిక శబ్దం వచ్చే మార్పులు చేసిన వాహనాలు, గట్టిగా ప్లే చేసే రికార్డింగ్ పరికరాలు,సరికాని విధంగా హారన్ వాడటం—ఇవన్నీ ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. అలాంటి వారి పై గరిష్టంగా 2,000Dh జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు విధించబడవచ్చు. వాహనం స్వాధీనం కావడంతో, దాన్ని విడుదల చేయించేందుకు 10,000Dh వరకు చెల్లించాల్సి ఉంటుంది.

అల్ మజ్రూయి మాట్లాడుతూ, శబ్ద కాలుష్యం ప్రజారోగ్యం మరియు సమాజ శాంతి పై చూపే ప్రభావాన్ని వివరించేందుకు దుబాయ్ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా, ట్రాఫిక్ పట్రోల్స్ మరియు స్మార్ట్ సిస్టమ్‌ల ద్వారా శబ్దం సృష్టించే వాహనాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారని చెప్పారు.

దుబాయ్ సౌందర్యం, శుభ్రత, భద్రత మరియు నాగరిక ప్రమాణాలను కాపాడటానికి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ ఫర్ ప్రిజర్వింగ్ ది సివిలైజ్డ్ అప్పియరెన్స్ ఆఫ్ దుబాయ్ పర్యవేక్షణలో ఈ విస్తరణ జరుగుతోంది.దుబాయ్ ప్రపంచానికి ఒక ఆదర్శనీయ నగరంగా నిలవడం ఈ కమిటీ లక్ష్యం.

అల్ మజ్రూయి చివరగా పేర్కొన్నదేమిటంటే—ఈ రాడార్ వ్యవస్థల లక్ష్యం జరిమానాలు విధించడం కాదు; రోడ్ల పై నాగరిక ప్రవర్తన పాటించడం ఎంత ముఖ్యమో డ్రైవర్లకు అవగాహన కల్పించడమే. ప్రశాంత వాతావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతగా ఆయన గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com