సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..
- November 17, 2025
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 12:00 గంటలకు బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు...డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు,11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మృతులు హైదరాబాద్‌కు చెందిన వారని తెలుస్తోంది. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటన సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర ప్రదేశాల మధ్య రహదారిపై జరిగింది. ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్‌హరామ్‌లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి కావడంతో, ఈ ప్రమాదం భారతదేశంలో విషాదాన్ని కలిగించింది. మృతుల్లో హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







