కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- November 17, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయా (KGBV)ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకచర్యలు తీసుకోనుంది. విద్యార్థినుల ఆరోగ్య రక్షణకోసం హైదరాబాద్ లోని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో ఒక ఎంబిబిఎస్ డాక్టర్ను నియమించనున్నారు. స్థానికంగా ఉన్న కేజీబీవీల్లోని విద్యార్థినుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి వచ్చిన ఆరోగ్య సమస్యలను అక్కడే ఉన్న ఏఎన్ఎం ద్వారా కమాండ్ కంట్రోల్లో ఉన్న డాక్టర్కు వివరిస్తారు. సమస్యను తెలుసుకున్న అనంతరం డాక్టర్ పిల్లలకు అవసరమైన మందులను కానీ లేదంటే అవసరమైన చికిత్సను గానీ అదీ కాకుండా ఇన్పషంట్గా ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తే అటువంటి విషయాన్ని ఏఎన్ఎంకు వివరిస్తారు. తద్వారా వారికి వెంటనే చికిత్సను అందించాలని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







