UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- November 17, 2025
న్యూ ఢిల్లీ: సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అరుదైన గుర్తింపు పొందింది.ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (United Nations International Children’s Emergency Fund–UNICEF) భారత విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా ప్రకటించింది.
ఈ నియామకంపై యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేశ్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం, పిల్లల హక్కులు, వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి బలమైన వేదిక అవుతుందని విశ్వసిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు.
అనంతరం కీర్తి మాట్లాడుతూ.. ‘‘ప్రతి చిన్నారికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం గౌరవంగా ఉంది’’ అని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల శ్రేయస్సే దేశానికి పునాది అని తాను బలంగా నమ్ముతానని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







