ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన
- July 24, 2016
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. ఓ 14 ఏళ్ల దళిత బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడి, యాసిడ్ లాంటి పదార్థం తాగించాడు. దీంతో అంతర్గత అవయవాలు పాడైపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాలిక మృతికి వ్యవస్థే కారణమంటూ తీవ్రంగా మండిపడింది.ఢిల్లీకి ఇంకా ఎంతమంది నిర్భయలు కావలి అంటూ డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ స్వాతీ మలివల్ తీవ్రంగా మండిపడ్డారు. 'మనం మరో నిర్భయ మృతి చెందేవరకు వెయిట్ చేశాం' అంటూ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో మహిళా కమిషన్ డీసీపీకి నోటీసు ఇచ్చిన తరువాతే నిందితుడిని అరెస్ట్ చేశారన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళల రక్షణ విషయంలో హోంమంత్రి అధ్యక్షతన ఓ కమిటీని నియమించాలని స్వాతీ సూచించారు. ఢిల్లీలో మహిళా రక్షణకు ఏర్పాటు చేసిన స్పేషల్ టాస్క్ పోర్స్ ను ఇటీవల కేంద్రం రద్దు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







