మలేషియాలో ఘోర పడవ ప్రమాదం...
- July 24, 2016
మలేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. శరణార్ధులతో ప్రయాణిస్తున్న ఓ బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం మలేషియా తీరప్రాంత సహాయక బృందాలు సోమవారం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 62 మంది ఉన్నారు. 34 మందిని సహాయక బృందాలు రక్షించాయి.ఇండొనేషియాకు చెందిన శరణార్థులు అక్రమంగా మలేషియాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ప్రాణాలతో బయటపడిన వారిని తిరిగి ఇండొనేషియాకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో తనతో పాటే ఉన్న భార్యను కాపాడుకోలేకపోయానంటూ ఓ వ్యక్తి స్థానిక మీదియాతో మాట్లాడుతూ బోరున విలపించాడు
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







