యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!

- November 17, 2025 , by Maagulf
యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!

యూఏఈ: యూఏఈలో ఈద్ అల్ ఎతిహాద్ ను పురస్కరించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 4 రోజులపాటు సెలవులు ప్రకటించారు. 

డిసెంబర్ 1, 2 వ తేదీన  ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించగా, డిసెంబర్ 3న ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి. అంతకుముందు నవంబర్ 29, 30 వ తేదీ సెలవులతో కలిపి నాలుగు రోజుల వీకెండ్ ఉద్యోగులకు లభిస్తుంది.      

డిసెంబర్ 2, 1971న ఏడు ఎమిరేట్లు కలిసి యూఏఈగా ఏర్పడిన చారిత్రాత్మక క్షణాన్ని యూఏఈ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆరోజును ఏటా ఈద్ అల్ ఎతిహాద్ పేరిట యూఏఈ వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక  ప్రదర్శనలతోపాటు అద్భుతమైన  ఫైర్ వర్క్స్ ను వీక్షించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com