ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- November 17, 2025
రియాద్: అల్-షామ్లి గవర్నరేట్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చైనా నివాసితులను సౌదీ పౌరుడు అహ్మద్ అల్-అంజీ రక్షించాడు. చైనీయులు ప్రయాణిస్తున్న వాహనం వరద నీటిలో బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారని గ్రహించిన అహ్మద్, వేగంగా స్పందించి నీటిలోకి ప్రవేశించాడు. వరదలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్న ఇద్దరిని సురక్షితంగా రక్షించాడు.
మరోవైపు, మక్కా, మదీనా మరియు రియాద్ ప్రాంతాలతో సహా సౌదీ అరేబియా అంతటా భారీ వర్షాలు , ఉరుములతో కూడిన తుఫానుల నేపథ్యంలో ఈ రక్షణ జరిగింది. ఇదిలాఉండగా, ఈ సీజన్ లో సౌదీ వ్యాప్తంగా తీవ్రమైన వర్షపాతం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







