ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- November 17, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్ పొందిన వారి వివరాలను ప్రకటించింది.ఖతార్ మరియు విదేశాలలో వివిధ విభాగాలలో సుమారు 850 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయనుంది.ఈమేరకు విద్యా మంత్రిత్వ శాఖలోని కెరీర్ గైడెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ సలేహ్ మొహమ్మద్ అల్-ముఫ్తా వివరాలను వెల్లడించారు.
జూలై 1 నుండి ఆగస్టు 30 వరకు స్కాలర్షిప్ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించిందని, 3,700 దరఖాస్తులు అందాయని చెప్పారు.ఇప్పటి వరకు దాదాపు 90శాతం దరఖాస్తులను ప్రాసెస్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం స్పాన్సర్షిప్ పొందిన 850 మంది విద్యార్థులలో, దాదాపు 250 మంది విదేశాలలో చదువుతున్నారని, మరో 600 మంది ఖతార్‌లోని వివిధ యూనివర్సిటీలలో చేరినట్లు వెల్లడించారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా వివిధ డిప్లొమాలు, బ్యాచిలర్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కలిగి ఉన్న ఖతారీల సంఖ్యను పెంచడం ఈ స్కాలర్షిప్ విధాన లక్ష్యం అని అల్-ముఫ్తా పేర్కొన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లినికల్ సైకాలజీ, న్యూరోసైన్స్ మరియు వంటి స్పెషలైజేషన్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అల్-ముఫ్తా వివరించారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







