'ప్రేమంటే' ఫన్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ ట్రైలర్ రిలీజ్

- November 17, 2025 , by Maagulf
\'ప్రేమంటే\' ఫన్ థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ ట్రైలర్ రిలీజ్

ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ  నారంగ్   నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యూట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత.  

ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. కొత్తగా పెళ్ళయిన జంట జీవితంలోని ప్రేమ, గొడవలు, సరదాలు, సంతోషాలని ట్రైలర్  ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లా ప్రజెంట్ చేసింది.

ప్రియదర్శి నేచరల్, హ్యుమరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సిట్యువేషన్ ఎంటర్టైనింగ్ గా వుంది. కానిస్టేబుల్ క్యారెక్టర్ లో సుమ కనకాల తన సిగ్నేచర్ మార్క్ తో అలరించారు. ట్రైలర్ చివర్లో తను చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఫన్ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ప్రజెంట్ చేశారు.  

సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి లైవ్లీ  విజువల్స్ అందించారు. లియాన్ జేమ్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్  ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ రాఘవేంద్ర తిరున్, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే, డైలాగ్ రైటర్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.

నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
మ్యూజిక్ ఆన్: సరిగమ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com