తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులో
- July 24, 2016
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు బయలుదేరిన తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ బయలుదేరిన కోదండరామ్ సహా ఐకాస నేతలను మెదక్ ములుగు మండలం ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు.మల్లన్నసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు గ్రామాల ప్రజలు నిన్న ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సుమారు 60 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







