తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులో

- July 24, 2016 , by Maagulf
తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులో

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు బయలుదేరిన తెలంగాణ ఐకాస బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌ బయలుదేరిన కోదండరామ్‌ సహా ఐకాస నేతలను మెదక్‌ ములుగు మండలం ఒంటిమామిడి వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు గ్రామాల ప్రజలు నిన్న ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో చేపట్టేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సుమారు 60 మందికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com