యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- November 19, 2025
మనామా: గాజా స్ట్రిప్‌లో పునర్నిర్మాణానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని బహ్రెయిన్ స్వాగతించింది. యూఎన్ ప్రణాళికకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. కాల్పుల విరమణను పటిష్టం చేయడం, పునర్నిర్మాణం మరియు పునరుద్ధరణ నిధుల కోసం "శాంతి మండలి"ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ప్రజలను రక్షించడానికి, నిరాయుధీకరణను అమలు చేయడానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ మానవతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పాలస్తీనా ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకోవడానికి మరియు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి మార్గం సుగమం చేసే చారిత్రాత్మక మైలురాయిగా దీనిని అభివర్ణిస్తూ, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయడానికి బహ్రెయిన్ తన పూర్తి మద్దతును తెలిపింది.
తాజా వార్తలు
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్‌లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!







