'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- November 20, 2025
హైదరాబాద్: “స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ (AI), మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో తెలంగాణ యువతను పరిశ్రమల భాగస్వామ్యంతో అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESIC) లో నిర్వహించిన “స్కిల్ కాన్వకేషన్ ఇన్ ఐటీ/ఐటీఈఎస్ సెక్టార్” కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ పై అపోహలు, కొత్త అవకాశాలు...
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, టెక్నాలజీ వేగంగా మారుతోందని, ఆ మార్పులను అందిపుచ్చుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. “ఏఐ” (A.I) వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహే అని, అది కేవలం ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందన్నారు.
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అంచనాలను ఆయన గుర్తు చేశారు: ఆటోమేషన్ వల్ల 85 మిలియన్ జాబ్స్ పోతే, కొత్తగా 97 మిలియన్ల స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
- కొత్త రంగాల్లో డిమాండ్: సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల వల్ల క్లీన్ టెక్, ఈవీలు, గ్రీన్ ఇన్నోవేషన్ రంగాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం, యువతకు సూచన
డిజిటల్ యుగంలో కేవలం అకడమిక్ డిగ్రీలతో మాత్రమే ఉద్యోగాలు రావని, ఇన్నోవేషన్, ప్రాబ్లం సాల్వింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే సక్సెస్ సాధ్యమన్నారు. తమ ప్రభుత్వం భవిష్యత్తును కేవలం ఊహించడం లేదని, దానికి అవసరమైన “స్కిల్లింగ్ ఎకో సిస్టమ్”ను నిర్మిస్తోందన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా “రెడీ టూ వర్క్ ఫోర్స్”ను తయారు చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకుందని మంత్రి వివరించారు.
తాజా వార్తలు
- 'స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ
- బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- బహ్రెయిన్ లో రెండో క్లాస్ స్టూడెంట్ పై ప్రశంసలు..!!
- ఆన్ లైన్ లో తప్పుడు ప్రకటనల పై నిషేధం..!!
- యూఎస్-సౌదీ మధ్య స్ట్రాటజిక్ AI భాగస్వామ్యం..!!
- వతన్ 2025 ఎర్సర్ సైజ్.. ప్రజలకు MoI హెచ్చరిక..!!
- యూఏఈ జాతీయులకు ఇండియా గుడ్ న్యూస్..!!
- అల్ అమెరాత్లో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి..!!
- తెలంగాణలో చలి అలర్ట్
- పోలీస్ కస్టడీకి ఐ-బొమ్మ రవి







