బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం
- November 20, 2025
బిహార్ లో, జేడీయూ అధినేత నితీష్ కుమార్ మళ్లీ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తదితరులు హాజరయ్యారు.
భారీ భద్రత, వేలాది మంది ప్రజల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది.నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి కావడం విశేషం. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఓ రికార్డు అని చెప్పాలి. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు. బీజేపీ (14), జేడీయూ (8), ఎల్జేపీ (రామ్‌విలాస్) (2), హిందుస్థానీ అవామీ మోర్చా (1), రాష్ట్రీయ లోక్ మోర్చా (1) సభ్యులతో మంత్రి వర్గం ఏర్పాటు చేయనున్నారు నితీష్.
మరో 10 మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకోనున్నారు.ఇక తన తండ్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ..”నా తండ్రి 10వ సారి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు నా శుభాకాంక్షలు.. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







